ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 1:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన కమిటీ:

భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన కమిటీ:

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 07:

అధ్యక్షుడిగా పూసల రమేష్ చారి, ప్రధాన కార్యదర్శిగా పూసల రాజేష్ చారి ఏకగ్రీవ ఎన్నిక

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి గారి నాయకత్వంలో భీమారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షుడిగా పూసల రమేష్ చారి (దాంపూర్), ప్రధాన కార్యదర్శిగా పూసల రాజేష్ చారి (భీమారం) లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి మాట్లాడుతూ, నూతన కమిటీ సభ్యులు విశ్వబ్రాహ్మణ కుల సంఘం అభివృద్ధి, కులవృత్తుల పరిరక్షణ, సంఘం ఐక్యత కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మండలంలోని పలువురు మేధావులు, సంఘ పెద్దలు ఈ సమావేశానికి హాజరై నూతన కమిటీకి తమ సహకారం అందించడం అభినందనీయమని, నూతన కమిటీ తన పనితీరుతో సంఘానికి మరింత బలోపేతం చేకూర్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రంగు నరేందర్ చారి, పూసల రుద్ర శర్మ, చెన్నోజు మనోహర్, తంగళ్లపెల్లి రమేష్, నూతి మధు శర్మ, నూతి రాంచందర్, నూతి శంకరయ్య, నాంపెల్లి రమేష్, తంగళ్లపెల్లి జనార్దన్, గనముక్కుల చందు, మేరడికొండ సమ్మయ్య, పాలిక రమేష్, తంగళ్లపెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు